గిరిజ‌న అమ్మాయిల‌తో ప్రేమ‌క‌థ సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా పుష్ప‌, ఆచార్య‌!

-

మెగా హీరోలు అడ‌వి బాట ప‌ట్టారు. ఇటు అల్లు అర్జున్ పుష్ప‌తో స్మ‌గ్ల‌ర్ గా క‌నిపిస్తుంటే.. అటు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ కూడా ఆచార్య‌లో గిరిజ‌న నేప‌థ్యం ఉన్న క‌థ‌తోనే వ‌స్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ గిరిజ‌న అమ్మాయిల‌తో ప్రేమాయ‌ణం సాగిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే పుష్ప‌లో ర‌ష్మిక లుక్ అచ్చం గిరిజ‌న అమ్మాయిలాగా క‌నిపించింది. ఆచార్య‌లో కూడా పూజా హెగ్దే గిరిజ‌న నేప‌థ్యం ఉన్న అమ్మాయి అని స‌మాచారం.


ఇంతకుముందు విరాఠపర్వం ట్రైలర్ లో సాయి పల్లవి అచ్చం ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించి మెస్మ‌రైజ్ చేసింది. ఇదే త‌ర‌హాలో అటు పుష్ప‌, ఇటు ఆచార్య గిరిజన అమ్మాయితో ప్రేమాయ‌ణం అనే లైన్ ను తీసుకోవ‌డం ఆస‌క్తి రేపుతోంది. అయితే విరాట ప‌ర్వంలో సాయిపల్లవి కాస్త మోడ్రనైజ్డ్ లుక్ లో కనిపించిన విష‌యం తెలిసిందే. కానీ ఆచార్య‌, పుష్ప‌లో అందుకు భిన్నంగా పూజాహెగ్డే.. రష్మిక లుక్ ఉంటుంద‌ని తెలుస్తోంది.
పుష్ప టీజర్ లో రష్మిక లుక్ స్ప‌ష్టంగా ఓ హింట్ ఇచ్చింది. ఆమె ప‌క్కా గిరిజ‌న అమ్మాయి అని చెప్ప‌క‌నే చెప్పింది టీజ‌ర్‌. ఇక ఆచార్య విష‌యానికొస్తే పూజా హెగ్డే లుక్ ఎలా ఉండనుంది అనేది సర్ ప్రైజ్ అనే చెప్పాలి. కొండ మల్లి గోండు మల్లి లుక్ లో కనిపిస్తుంద‌ని చాలామంది ఇప్ప‌టికే ట్రోల్స్‌ మొద‌లెట్టారు.
మ‌రి పూజా హెగ్దే అలాగే ఉంటుందా..లేక వేరే ఇంకేదైనా లుక్‌లో క‌నిపిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా మెగా హీరోలు గిరిజ‌న అమ్మాయిల‌తో ప్రేమ‌లో ప‌డిపోవ‌డం కాస్త ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news