పెళ్లికి రెడీ అయిపోతున్న త్రిష‌.. హింట్ ఇచ్చేసిందిగా..

-

రెండు ద‌శాబ్దాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది త్రిష‌. త‌న న‌ట‌న‌తో, అందంతో స్టార్ హీరోయిన్‌గా కూడా ఎదిగింది. కొత్త హీరోయిన్ల‌కు స‌వాల్ విసురుతూ తాను ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. ఇప్ప‌టికీ సినిమాలు చేస్తూ కుర్ర‌కారు గుండెల్లో నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం వ్యాపారవేత్త అయిన వరుణ్ మణియన్ తో పెళ్లికి రెడీ అయిపోయింది. ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ పెళ్లి ఆగిపోయింది. ఎంగేజ్ మెంట్ ను బ్రేక్ చేసుకున్నట్లుగా ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. ఇక అప్ప‌టి నుంచి త్రిష మళ్లీ పెళ్లి ప్రస్థావన తీసుకు రావ‌ట్లేదు. కానీ మీడియాలో ఇంకా ఆమె పెళ్లి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.


ఇప్పుడు త్రిష వయసు 38 సంవ‌త్స‌రాలు. కొన్ని రోజుల క్రితం ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాను 40 ఏళ్ల లోపే పెండ్ల ఇచేసుకుంటాన‌ని చెప్పుకొచ్చింది. అంటే ప్ర‌స్త‌తుం ఆమె పెళ్లికి సిద్ధ‌మే అని గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంద‌న్న‌మాట‌. ఇప్పటికే త్రిష కు కాబోయే వాడు ఫిక్స్ అయిపోయాడని స‌మాచారం. గ‌తంలో లాగే ఓ బిజినెస్ మ్యాన్ తో త్రిష పెళ్లి జరుగుతుంద‌ని తెలుస్తోంది.
ఈ ముద్దుగుమ్మ కుటుబ సభ్యులు ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లికి ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే మీడియాలో క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇక ఈ లేటు వ‌య‌సు బామ పెళ్లి గురించి చాలా మందే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే త్రిష‌కు ఇప్ప‌టికీ యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. అయితే ఆమె పెళ్లిఅయినా సినిమాలు చేయాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రి పెళ్లి చేసుకుంటే సినిమాలు చేస్తారా లేక ఆపేస్తారా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news