ఆహాలో లవ్ స్టోరీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

నాగ చైతన్య సాయి పల్లవి హీరో.. హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా మా థియేటర్ లలో విడుదల కాగా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అల్లు వారి ఓటిటి ఆహా సినిమా డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా అక్టోబర్ 22 నుంచి లవ్ స్టోరీ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం.love story movie photos

దీనిపై అధికారిక ప్రకటన అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వెవ్ తర్వాత విడుదలైన సినిమాలలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా లవ్ స్టోరీ చిత్రం నిలిచింది. అంతేకాకుండా కరోనా తర్వాత ఎక్కువమందిని థియేటర్లకు రప్పించిన సినిమాగా కూడా లవ్ స్టోరీ నిలవడం విశేషం. ఈ అందమైన ప్రేమ కథా చిత్రానికి థియేటర్ లో మంచి మార్కులు పడగా మరి ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి.