Business Ideas : కొవ్వొత్తుల త‌యారీ బిజినెస్.. మహిళలకు చక్కని ఆదాయ మార్గం..!

-

సాధార‌ణంగా ఇండ్ల‌లో మ‌నం క‌రెంటు పోతే చాలు.. కొవ్వొత్తులను వెలిగిస్తాం. ఇక బ‌ర్త్‌డేల వంటి సంద‌ర్భాల్లో ఆ ర‌కానికి చెందిన క్యాండిల్స్‌ను వెలిగించి ఆర్పుతారు. అలాగే బెడ్‌రూంల‌లో వెలిగించుకునే ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే ఇవే క్యాండిల్స్‌ను త‌యారు చేసే బిజినెస్ చేస్తే.. చాలా త‌క్కువ పెట్టుబ‌డితోనే ఎక్కువ లాభాలు సంపాదించ‌వ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

క్యాండిల్స్‌లో.. ఆర్డిన‌రీ, డిజైన‌ర్, ఫ్రాగ్రెన్స్, డెక‌రేటివ్, బ‌ర్త్‌డే క్యాండిల్స్.. ఇలా ర‌క ర‌కాల క్యాండిల్స్‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. అయితే అన్నింటిక‌న్నా ఆర్డిన‌రీ క్యాండిల్స్ త‌యారీ చాలా తేలిక‌. దీనికి చాలా త‌క్కువ పెట్టుబ‌డి అవుతుంది. క్యాండిల్స్‌ను త‌యారు చేసేందుకు కావ‌ల్సిన మౌల్డ్ ఒక్క‌టి మార్కెట్‌లో రూ.2వేల వ‌ర‌కు ల‌భిస్తుంది. ఎన్ని ఎక్కువ మౌల్డ్స్ ఉంటే అన్ని ఎక్కువ కొవ్వొత్తుల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక కొవ్వొత్తుల త‌యారీకి క్యాండిల్‌ వ్యాక్స్ అవ‌స‌రం అవుతుంది. ఇది మార్కెట్‌లో కేజీకి రూ.100 వ‌ర‌కు ఉంటుంది. అలాగే ఒత్తుల‌కు కాట‌న్ థ్రెడ్స్ అవ‌స‌రం అవుతాయి.

ఇక కొవ్వొత్తుల‌ను త‌యారు చేసేందుకు ముందుగా క్యాండిల్ మౌల్డ్స్‌పై కొబ్బ‌రినూనె పూయాలి. అనంత‌రం క్యాండిల్ వ్యాక్స్‌ను మ‌రిగించి మౌల్డ్స్‌లో పోయాలి. త‌రువాత మౌల్డ్స్‌ను చ‌ల్ల‌ని నీటిలో వేయాలి. దీంతో నెమ్మ‌దిగా వ్యాక్స్ గ‌ట్టి ప‌డి కొవ్వొత్తులు దృఢంగా మారుతాయి. ఇలా కొవ్వొత్తులు త‌‌యార‌వుతాయి. వాటిని మౌల్డ్స్ నుంచి తీసి ప్యాకింగ్ చేయాలి. అనంతరం వాటిని షాపులు, సూప‌ర్ మార్కెట్ల వారికి స‌ప్ల‌యి చేయాలి. దీంతో చ‌క్క‌ని సంపాద‌న ల‌భిస్తుంది.

సాధార‌ణంగా కొవ్వొత్తుల‌ను మ‌నం త‌యారు చేసే సైజును బ‌ట్టి అమ్మ‌వ‌చ్చు. ఇక 1 కేజీ వ్యాక్స్‌తో చిన్న సైజున్న కొవ్వొత్తులు 30 త‌యారు చేయ‌వ‌చ్చు. వీటిని మార్కెట్‌లో ఒక్కొక్క‌టి రూ.10 చొప్పున విక్రయిస్తే.. రూ.300 వ‌స్తుంది. ఇందులోంచి రూ.140 ఖ‌ర్చు తీసేస్తే.. రూ.160 వ‌స్తుంది. ఇది మ‌న‌కు వ‌చ్చే లాభం. ఇక నిత్యం 10 కేజీల వ‌ర‌కు కొవ్వొత్తుల‌ను త‌యారు చేస్తే రూ.1600 వ‌స్తాయి. అదే నెల‌కు అయితే రూ.48వేలు వ‌స్తాయి. ఇలా చాలా త‌క్కువ పెట్టుబ‌డితో ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలు సంపాదించ‌వ‌చ్చు. అయితే ఇందుకు మార్కెటింగ్ బాగా చేయాలి. కిరాణా షాపులు, సూప‌ర్ మార్కెట్ల వారితో టై అప్ అయితే.. వారికి త‌ర‌చూ కొవ్వొత్తుల‌ను స‌ప్ల‌యి చేస్తూ.. ఈ బిజినెస్‌లో చ‌క్క‌ని ఆదాయం పొంద‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version