గ్యాస్ సిలెండర్ వినియోగదారులకి గుడ్ న్యూస్.. నాలుగు ఆఫర్లు మీకోసం..!

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకి గుడ్ న్యూస్. గ్యాస్ సిలెండర్ ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా బుక్ చేస్తూ వుంటారు. కొందరు ఫోన్ కాల్ ద్వారా బుక్ చేస్తే మరి కొందరు కంపెనీ యాప్ ద్వారా సిలిండర్ ని బుక్ చేసుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కువ మంది పేటీఎం, గూగుల్ పే వంటి తదితర యాప్స్ ద్వారా బుక్ చేయడం జరుగుతోంది. అయితే దీనితో ఒక్కో విధంగా బుక్ చేస్తే ఒక్కో అఫర్ ఉంటుంది. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

బజాజ్ ఫిన్‌సర్వ్ ఆఫర్ ని చూస్తే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై అదిరే ఆఫర్ ని పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా సిలెండర్ ని బుక్ చేసుకుంటే రూ. 70 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. బజాజ్ పే యూపీఐ ద్వారా గ్యాస్ సిలిండర్ కి పే చేస్తే ఈ ఆఫర్ పొందొచ్చు. కరెంటు బిల్లు, మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్ చేసిన కూడా ఆఫర్స్ వున్నాయి. రూ. 230 వరకు క్యాష్‌బ్యాక్ వీటిపై వస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే పేటీఎంలో కూడా సిలిండర్ బుకింగ్‌ పై ఆఫర్లను పొందొచ్చు. రూ.10 నుంచి రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్ ని పొందేందుకు గ్యాస్1000 ప్రోమో కోడ్ ఉపయోగించాలి. అలానే పీఎన్‌బీ క్రెడిట్ కార్డు ద్వారా సిలిండర్ బుక్ చేస్తే రూ. 30 క్యాష్‌బ్యాక్ ని పొందొచ్చు. దీనికి మీరు ఫ్రీగ్యాస్ అనే ప్రోమో కోడ్ ని ఉపయోగించాలి.