భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు…ఇప్పుడు ఏయే ప్రదేశాలలో ఎంతంటే..?

-

ప్రతీ నెలా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. ఓ సారి తగ్గితే ఓ సారి పెరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి స్థిరంగా కూడా కొనసాగొచ్చు. ఇక తాజాగా గ్యాస్ ధరలు తగ్గినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈసారి కూడా గ్యాస్ ధరలను తగ్గించాయి. వరుసగా ఐదో నెల తగ్గించాయి. జూన్ నుంచి ఏకంగా ఏడో సారి గ్యాస్ ధరలను తగ్గించారు.

ఇప్పుడు ఏకంగా సిలిండర్ రేటు రూ. 610 తగ్గింది. ఇక మరి ఏయే ప్రాంతాల్లో ఎంత ధర ఉందనేది చూస్తే..ఢిల్లీ లో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.115.50 తగ్గింది. దీనితో రూ.1744కు దిగొచ్చింది. ముందైతే రూ.1859గా ఉంది. అదే కలకత్తా లో అయితే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1959 నుంచి 1846 రూపాయలకు వచ్చేసింది.

చెన్నైలో రూ.2009.50 వద్ద వున్నా సిలిండర్ ఇప్పుడు రూ.1893కు చేరింది. అదే ముంబయిలో చూస్తే రూ.1696 రూపాయలుగా వుంది. భారత ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు రేట్లను ప్రతీ నెలా కూడా సవరించాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినందునే ఈ రేట్లు కూడా తగ్గాయి. ఇక వంట గ్యాస్ విషయానికి వస్తే.. 14.2 కేజీల సిలిండర్‌ ని జులై 6న రూ.50 మేర పెంచాయి. ఢిల్లీలో ఇప్పుడు వంటగ్యాస్ ధర రూ.1053కు చేరింది. కోల్‌కతా, ముంబయి, చెన్నైల్లో రూ.1079, రూ.1052.5, రూ.1068.5గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news