టాటా స్టీల్ మాజీ ఎండీ, ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్ జె ఇరానీ(86) సోమవారం అర్ధరాత్రి జంషెద్‌పుర్‌లో మరణించినట్లు టాటాస్టీల్ తెలిపింది. ఇరానీకి టాటా స్టీల్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆయన 2011 జూన్‌లో టాటా స్టీల్ బోర్డు నుంచి తప్పుకున్నారు.
“స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ మరణం పట్ల చాలా బాధపడుతున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని టాటా స్టీల్ ట్వీట్ చేసింది.
We are deeply saddened at the demise of Padma Bhushan Dr. Jamshed J Irani, fondly known as the Steel Man of India. Tata Steel family offers its deepest condolences to his family and loved ones. pic.twitter.com/gGIg9JgGMS
— Tata Steel (@TataSteelLtd) October 31, 2022