పాక్షిక చంద్రగ్రహణం…! విశేషాలు ఇవే… భారత్ లో ప్రభావం ఉండదు…!

-

మరికొంతసేపటిలో ఆకాశం లో అద్భుతమైన దృశ్యాలు…! మరికొంతసేపట్లో చంద్రగ్రహణం సంభవించనుంది. గత 30 రోజులో ఇది మూడవ గ్రహణం కావడం విశేషం. కాగా గురు పౌర్ణమి నాడు ఇలా చంద్రగ్రహణం సంభవించడం ఇది మూడవ సారి. ఈ ఏడాది లో గ్రహణం సంభవించడం ఇదే చివరిసారి అవుతుంది ఈ ఏడాది లో ఇక గ్రహణాలు ఉండవు. అయితే ఈ గ్రహణం అన్నీ దేశాల్లో కనిపించాడు ముఖ్యంగా భారత్ లో ఈ గ్రహణం కనపడదు. ఉత్తర అమెరికా, యూరోప్, ఆఫ్రికాలో ఈ గ్రహణం కనపడుతుంది. దాంతో మన దేశంలో గ్రహణం ప్రభావం ఉండదు.. గ్రహణ సూతకం కూడా పాటించనక్కర్లేదు. భారత్ లో గ్రహణం లేనందున మతపర ధార్మిక అంశాలకు ఆటంకం ఉండదు. ఈ చంద్రగ్రహణం జులై 5న ఏర్పడుతుంది. భారతదేశంలోని ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించలేరు. దాదాపు 2 గంటల 43 నిమిషాల 24 సెకండ్ల పాటు కొనసాగుతుంది. ఆ రోజు ఉదయం 8.38 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 11.21 గంటలకు ముగుస్తుంది.  సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై వచ్చినపుడు.. చంద్రబింభం భూమిపై పూర్తిగా కనిపించకపోయినట్లయితే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అని అంటారు. పాక్షికంగా కనిపిస్తే దాన్ని పాక్షిక లేదా ఉపఛాయ చంద్రగ్రహణం అని అంటారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం అంత ప్రభావం చూపదు. ఇది కేవలం భూమిపై కొన్ని ప్రదేశాల్లోనే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ సమయం కూడా ఉండదు. ఈ రోజు ఏర్పడే చంద్రగ్రహణం గతేడాది జనవరి 21 కూడా సంభవించింది.

Read more RELATED
Recommended to you

Latest news