ISRO : ఎల్‌వీఎం-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

-

ISRO సంధించిన ఎల్‌వీఎం-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్ మాట్లాడుతూ.. ఎల్‌వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను జిఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ ప్రవేశపెట్టిందని.. ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోగం జరిగిందని చెప్పారు.

ఇస్రో సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని.. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఉపగ్రహాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. దీనికి సంబంధించి పని జరుగుతోందని వెల్లడించారు. మార్క్ 3 రాకెట్ ద్వారా మరిన్ని వాణిజ్య ప్రయోగాలు చేస్తామని చెప్పారు. జి.ఎస్.ఎల్.వి.మార్క్ 3 రాకెట్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఇస్రో చైర్మన్ డా.సోమనాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version