డాక్టర్ అనిల్ తెరకెక్కించిన మా ఊరి పొలిమేర పార్ట్ 1 లో వెతికి చూడ్డానికి కూడా పొరపాట్లు లేకుండా పకడ్బందీ స్క్రీన్ ప్లే తో సక్సెస్ అయింది. ఆ తరువాత సీక్వెల్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ సీక్వెల్ నుండి కాసేపటి క్రితమే టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ నిడివి కేవలం 68 సెకన్లు మాత్రమే ఉంది. టీజర్ చూస్తున్నంత సేపు ఇంటరెస్టింగ్ గా ఏమీ అనిపించలేదు. పార్ట్ 1 హిట్ అయింది కదా అని ఇందులో చాలా ఎక్కువ చేసినట్టున్నాడు డైరెక్టర్.. సింపుల్ కథతో రంజింపచేసే కథనంతో వస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకుని హిట్ కొట్టగలడు. కానీ ఈ టీజర్ చూస్తే అలా అనిపించడం లేదు. ఇక పాత్రలను కూడా బలవంతంగా మరికొందరిని యాడ్ చేసినట్లున్నారు.
రిలీజ్ అయ్యే లోపు ఎడిటింగ్ లో కొన్ని సీన్ లను తీసేస్తే నష్టం తగ్గవచ్చు లేదంటే ఈ సినిమా హిట్ అవ్వడం కష్టమే.