తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న నరేష్ ని తప్పించడానికి రంగం సిద్దమైంది. ఆయన్ను తప్పించేందుకు గాను ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆయన్ను పదవి నుంచి తప్పించడానికి మా ఈసీ క్రమ శిక్షణా సంఘానికి లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. ఇటీవల క్యాలెండర్ ఆవిష్కరణ సమయంలో నరేష్ పై రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆ తర్వాత వివాదం చినికి చినికి గాలి వానగా మారింది.
ఒక దాని తర్వాత ఒకటి లుకలుకలు బయట పడుతూ వస్తున్నాయి. ఉపాధ్యక్షురాలిగా ఉన్న జీవిత, అధ్యక్షుడిగా ఉన్న నరేష్ తో సిని పెద్దలు చిరంజీవి, నాగార్జున, కృష్ణం రాజు సహా పలువురు మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. ఒక వర్గం మీడియాకు దీనిపై లీకులు ఇస్తూ వస్తుందని సిని పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. నరేష్ యాక్టివ్ గా ఉండటం లేదు, అతన్ని పక్కన పెట్టాలని ఒక లేఖను కూడా క్రమశిక్షణా సంఘానికి ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే నరేష్ వర్గం మాత్రం, జీవిత వర్గం సమావేశాలకు వస్తే వివాదాలను సృష్టించే విధంగా ప్రవర్తిస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ కొందరి వాదన మరో రకంగా ఉంది. వీళ్ళకు ఇగో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వెయ్యి మంది సభ్యులు కూడా లేని కార్యవర్గాన్ని నడపడానికి ఎప్పుడు వివాదాలతో నెట్టుకు వస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే నరేష్ ని తప్పించడానికి రంగం సిద్దం చేసారని అంటున్నారు.