మాలో మహాసంగ్రామం జరగుతోంది. మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజకీయాలు తారాస్థాయి చేరాయి. రాజకీయ పార్టీను తలదన్నేలా రాజకీయం నడుస్తోంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీపడుతున్నాయి. రెండు ప్యానెళ్ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కాకరేపుతున్నాయి. తాాజాగా మా ఎన్నికల బరిలోంచి తప్పుకుని బండ్ల గణేష్ సంచలనం రేపారు. నాదైవ సమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయుల సలహామేరకు జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్లో ప్రకటించాడు. తాజాగా ప్రకాష్ రాజ్ అన్న నా దగ్గరకు వచ్చి పోటీ నుంచి విరమించుకోవాలని కోరడంతో తాను పోటీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కే అని తెలిపారు. ’మా‘ లో మహాసంగ్రామ జరుగుతుందని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. పోసాని ఎక్స్పైర్ ట్యూబ్ లాంటి వాడని విమర్శించారు. రానున్న రోజుల్లో మా ఎన్నికలు మరింత వాడీవేడీ వాతావరణ ఏర్పడే అవకాశం ఉంది.