ఆలివ్ ఆయిల్ తో ఈ సమస్యలు మాయం..!

-

ఆలివ్ ఆయిల్ వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి కూడా ఆలివ్ ఆయిల్ బాగా సహాయపడుతుంది. అలాగే చర్మ సంరక్షణకు కూడా ఆలివ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా చాలా మంది డాక్టర్లు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి ఆలివ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది అని అంటూ ఉంటారు. క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.

Olive-oil
Olive-oil

ఈ మధ్యకాలంలో ఆలివ్ ఆయిల్ యొక్క వాడకం బాగా పెరిగింది. ఆలివ్ ఆయిల్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఆలివ్ ఆయిల్ వల్ల చర్మానికి, జుట్టుకి ఎలా మేలు కలుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.

మంచి క్లెన్సర్

ఆలివ్ ఆయిల్ మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది. మేకప్ ని రిమూవ్ చేయడానికి ఆలివ్ ఆయిల్ తో చేసుకోవచ్చు. దూది తీసుకుని దానిలో ఆలివ్ ఆయిల్ వేసి మేకప్ ని రిమూవ్ చేసుకోవచ్చు.

మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది

ఆలివ్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రాత్రిపూట ఆలివ్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేసుకుంటే స్కిన్ మృదువుగా ఉంటుంది.

యాంటీ ఏజింగ్

ఆలివ్ ఆయిల్ చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా తొలగిస్తుంది. అలానే ముసలితనం త్వరగా రాకుండా అది చూసుకుంటుంది.

జుట్టుకి ప్రయోజనకరం

ఆలివ్ ఆయిల్ జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టు దృడంగా ఉండేటట్టు చూసుకుంటుంది కాబట్టి ఆలివ్ ఆయిల్ తో జుట్టు ని రెగ్యులర్ గా మసాజ్ చేస్తూ ఉండండి ఇలా ఎన్నో లాభాలని మనం ఆలివ్ ఆయిల్ తో పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news