MAA ELECTIONS : మా ఫ్యామిలీ జోలికి రాకండి..నాగబాబు కు విష్ణు వార్నింగ్..!

మరికొన్ని గంటల్లో మా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మంచు విష్ణు నాగబాబుపై ఫై ఫైర్ అవుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాగబాబు అంకుల్ మీరు చిన్నప్పటి నుండి నన్ను చూడలేదా… నాపై మీకు ఎందుకు అంత కోపం అంటూ ప్రశ్నించారు. చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవమని అందువల్లే తాను విమర్శించడం లేదని అన్నారు.

నేను వరుణ్ తేజ్ లాగా కాదా మీ ముందు పెరిగిన వాణ్ణి కదా అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇలాంటి చిన్న మా ఎలక్షన్స్ కోసం నన్ను విమర్శిస్తారా.. అంటూ మంచు విష్ణు ప్రశ్నించారు. మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు అంటూ ప్రశ్నించారు. మా కుటుంబాన్ని లాగొద్దని మా నాన్నగారు చాలా ఓపిక పడుతున్నారని విష్ణు అన్నారు. తెలుగు పరీక్ష పెడితే ప్రకాష్ రాజ్ కు 90 వస్తే నాకు 10 మార్కులు వస్తాయి అన్నారు. మరి ఏ భాషలో అయినా ఇద్దరిలో క్యారెక్టర్ ఎవరికి ఉంటుందో మా సభ్యులను అడగాలని చెప్పారు. దయ చేసి మా ఫ్యామిలీ జోలికి రావద్దని మనందరం ఒకే ఫ్యామిలీ అని విష్ణు నాగబాబుకు చెప్పారు.