గత కొన్ని ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొలిక్కిరాని అంశంలో పోడు భూముల సమస్య ఒకటి. తాజా పోడు భూముల వివాదంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ మూడో వారం నుంచి పోడు సమస్య పరిష్కారానికి బీజం పడనుంది. పోడు భూముల పరిష్కారానికి అన్ని పార్టీల ఎమ్మేల్యేల సహకారం ఉండాలని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. పోడు భూముల పరిష్కారానికి అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం అనంతరం తెలంగాణలో గజం అటవీ భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని సీఎం స్పష్టం చేశారు. అడవుల పరిరక్షణ కొరకు కఠిన చర్యలకు కూడా వెనుకాడొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. అడవుల్లో అక్రమ చొరబాట్లు లేకుండా చర్యలు తీసుకునే బాధ్యత అటవీ అధికారులదే అని స్పష్టం చేశారు. అటవీ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల మూడో వారం నుంచి అర్హులైన పోడు వ్యవసాయదారులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
-