రాజశేఖర్ ఫ్యామిలీ పై మీరు దాడి చేయించలేదా..నాగబాబు పై విష్ణు ఫైర్..!

నాగబాబు తనపై చేసిన విమర్శల పై తాజాగా మంచు విష్ణు స్పందించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శలు చేస్తే తనపై చేయాలని తన కుటుంబం జోలికి రావద్దని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్ ను తనకు పోటీగా నిలబెట్టింది నాగబాబు మరి కొందరు వ్యక్తులు అని అన్నారు. మీరు విమర్శలు చేస్తారా అని అదే మీపై విమర్శలు చేస్తే ఫ్యాన్స్ కు చెప్పి దాడులు చేపిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జీవితా రాజశేఖర్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు మీ అభిమానులు దాడి చేయలేదా అని ప్రశ్నించారు.

మీరే ఉసిగొల్పి దాడి చేయించారని ఆ తర్వాత వాళ్ళు అసలు ఫ్యాన్స్ అసోసియేషన్ లో సభ్యులుగా లేరని చెప్పారని ఆరోపించారు. కారులో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని చూడకుండా మీ ఫ్యాన్స్ దాడి చేశారు అంటూ విష్ణు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ద్వారా మీ హ్యూమర్ తో మీన్స్ చేపిస్తూ ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. ఇక చివరగా మంచు విష్ణు రేపు ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి అంకుల్ అంటూ తన స్పీచ్ ను ముగించారు.

https://youtu.be/yDma7J9Gtn4