MAA ELECTIONS : ముగిసిన పోలింగ్.. రికార్డు స్థాయిలో ఓటింగ్..!

ఉద‌యం 8గంట‌ల‌కు మా ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభం కాగా మ‌ద్యాహ్నం మూడు గంట‌ల‌కు పోలింగ్ ముగింసింది. మ‌ద్యాహ్నం 2గంట‌ల‌కే పోలింగ్ పూర్తి కావాల్సి ఉండ‌గా మ‌రికొంద‌రు సెల‌బ్రెటీలు ఓటు వేయాల్సి ఉండ‌టం ట్రాఫిక్ ఇబ్బందుల కార‌ణంగా మ‌రో గంట పొడిగించారు. ఇక పోలింగ్ పూర్త‌య్యే స‌రికి మొత్తం 626 ఓట్లు పోల్ అయ్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 4వంద‌ల‌కు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. ఇక తాజాగా పోలింగ్ శాతం పెర‌గ‌టంతో పోటీలో ఉన్న అభ్య‌ర్థులు అనందం వ్య‌క్తం చేశారు. అటు ప్ర‌కాష్ రాజ్ ఇటు మంచు విష్ణు ఇద్ద‌రూ కూడా పోలింగ్ శాతం పెర‌గ‌టం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు.maa elections

ఇక సాయంత్రం 5గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అంతే కాకుండా అర్ధ‌రాత్రి లోపు ఫ‌లితాలు వెలుబ‌డే అవ‌కాశం ఉంది. దాంతో ఇప్పుడు ఫ‌లితాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. అయితే పోలింగ్ పోటాపోటీగా జ‌రిగినట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దాంతో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ఇద్ద‌రికీ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.