కెసిఆర్ కత్తి అందిస్తే.. హరీష్ రావు పొడుస్తున్నాడు : ఈటల

-

సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో ఉండి కత్తి అందిస్తే హరీష్ రావు వచ్చి పొడుస్తున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. కాళోజీ చెప్పినట్టు ప్రాంతం వాడిని ఇక్కడే పాతి పెట్టాల్సిందేనని మండిపడ్డారు. ఇవాళ కమలాపూర్ మండలం లోని శ్రీరాములపల్లి గ్రామంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కెసిఆర్ మాట్లాడితే ఒకనాడు తెలంగాణ పులకించిందని… అడుగులో అడుగు వేసిందని గుర్తు చేశారు. ఈ రోజు ఎవరు ఎక్కువ ఆయనను తిడితే అంత ప్రజలు చప్పట్లు కొడుతున్నారని… అంటే అయన పెరిగినట్ట, తరిగినట్టా? అయన చరిత్ర హీనం అవుతుందని చురకలు అంటించారు.

అణిగి మనిగి ఉంటే కెసిఆర్ పొగుడుతారని… ప్రశ్నిస్తే పంపిస్తాడన్నారు. కెసిఆర్ నువ్వు కాదు నీ జేజెమ్మ వచ్చినా ఇక్కడ గెలవలేవని సవాల్ విసిరారు. కెసిఆర్ బానిసల్లార మీ భరతం పట్టే రోజు దగ్గర్లో ఉందని టిఆర్ఎస్ ఎమ్యెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. కళ్ళు ఉండి చూడలేని కబోదులు, అబద్దాల కోరులు మామ, అల్లుడు అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news