బాలయ్యకు షాక్..అఖండ హీరోయిన్ కు కరోనా !

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి… ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చిత్ర పరిశ్రమ పైనే పడింది. కరోనా కారణంగా షూటింగులు మరియు థియేటర్లు మూత పడ్డాయి. అలాగే చాలామంది సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

” ఆదివారం రోజు నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు రోజుల వ్యాక్సిన్ తీసుకున్నాను. అంతకుముందు కరువు బారిన పడ్డాను. ఇప్పుడు మరోసారి కరోనా నాకు వచ్చింది. వైద్యుల సూచనల మేరకు తాను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. తనను పదిరోజులుగా కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి ” అంటూ ప్రగ్యా జైస్వాల్ పేర్కొంది. కాగా బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే