మమ్మల్ని గర్వపడేలా చేశారు….థాంక్స్ : కావ్య మారన్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి తీవ్ర నిరాశలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లకు జట్టు యజమాని కావ్యా మారన్ ధైర్యం చెప్పారు. ‘మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. T20 క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. ఫైనల్లో ఓడటం బాధాకరం. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని రంగాల్లో రాణించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కప్పు గెలిచినా అందరూ మీ గురించే మాట్లాడుతున్నారు. బాధలో ఉండొద్దు. థాంక్యూ’ అని జట్టు డ్రెస్సింగ్ రూమ్లో కావ్య మాట్లాడిన వీడియోను సన్ రైజర్స్ విడుదల చేసింది.

కాగా, ఐపీఎల్ చరిత్రలో అత్య ధిక స్కోర్ (287), పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్ (125), అత్యంత వేగంగా 150+ స్కోర్ ఛేదన.. ఇలా ఎన్నో రికార్డులను సన్ రైజర్స్ హైదరాబాద్ తిరగరాసింది. అభిషేక్, హెడ్, క్లాసెన్ వీర బాదుడు కోసం మిగతా జట్ల ఫ్యాన్స్ సైతం సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం ఎదురుచూసేవారు. విధ్వంసకర ఆటతీరుతో కమిన్స్ సేన మిగతా జట్లను భయపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news