హైదరాబాద్​ లో గాలివాన మృతుల కుటుంబాలకు కేటీఆర్​ సాయం

-

హైదరాబాద్​లో ఆదివారం రోజున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గాలి వాన బీభత్సానికి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. భారీ వర్షానికి నగరంలోకి శేరిలింగంపల్లి నియోజకవర్గం హాఫీజ్‌పేట్​లో చనిపోయిన రెండు కుటుంబాలను బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల సాయన్ని అందించారు.

ఆదివారం రోజున నగరంలో విపరీతంగా గాలి దుమారంతో కూడిన వర్షం కురవడంతో కాంపౌండ్ వాల్ కూలి 51 ఏళ్ల అడ్వొకేట్​ చనిపోగా రేకులపై ఉన్న రాయి మీద పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. నిన్న కురిసిన వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది చనిపోయారని, వర్షాకాలం రాకముందే ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని​ కోరారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్​రూం ఇళ్లను నిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులను వెంటనే జీహెచ్​ఎంసీ షెల్టర్లకు తరలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news