తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వ మార్పు పై మాజీ ఎంపీ,ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ళు టీ పీసీసీ చీఫ్ గా ఒకే వ్యక్తి ఉన్నారని ఇప్పటికైనా రాష్ట్రంలో పార్టీ అధ్యక్షున్ని మార్చాలన్నారు. దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు జరిగే అవకాశం ఉందని దీని పై హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలింగ్ కంటే ముందే కాంగ్రెస్ కాడి జారేసిందన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుని మార్పు పై మధుయాష్కీ కామెంట్స్ పార్టీలో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. 2023 లో అధికారంలో కి వచ్చేది మేమే అని చెప్పుకొనే కాంగ్రెస్ కి…ఇప్పటికి ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియకపోతే…ఎలా అని పార్టీ నేతలనుంచే నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి.