వైఎస్సార్ కల్లోకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ గురించి బాధపడ్డారు: టీడీపీ నేత మాగంటి

-

చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన విషయం పట్ల టీడీపీ నేతలు బాధపడుతున్నారు. ఇక చంద్రబాబు సతీమణి మరియు కోడలు అయితే కన్నీరుమున్నీరు అవుతూ రాష్ట్రంలో ప్రజల సానుభూతిని వర్క్ అవుట్ చేసే పనిలో ఉన్నారంటూ కొన్ని వార్తాపత్రికలు కథనాలు రాస్తున్నాయి. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ గురించి ఒక ఆసక్తికరమైన వార్తను టీడీపీ నేత ప్రజలతో పంచుకున్నాడు. టీడీపీ నేత మాగంటి బాబు మాట్లాడుతూ గత రాత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా కలలోకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ గురించి ఒక కీలక విషయం చెప్పాడని కామెంట్ చేయడం విశేషం.. మా గంటి బాబు చెబుతున్న ప్రకారం కలలో వైఎస్సార్ చంద్రబాబు ను అరెస్ట్ చేయాల్సింది కాదంటూ బాధపడ్డారట, ఈ విషయంలో నా కొడుకు జగన్ పొరపాటు చేశాడంటూ తెలిపాడట.

తండ్రి వయసు ఉన్న చంద్రబాబు ను అరెస్ట్ చేయడం పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరు తప్పు అంటూ , నువ్వే జగన్ కు ఇది తప్పు అని తెలియచేయాలంటూ మాగంటి బాబుకు చెప్పారట వైఎస్సార్.

Read more RELATED
Recommended to you

Latest news