షాకింగ్ : టీడీపీ యువనేత ఆత్మహత్యాయత్నం.. అసలేమైంది ?

Join Our Community
follow manalokam on social media

ఏలూరు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు రామ్ జీ అలియాస్ రామ చంద్రన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెబుతున్నారు. అయితే ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని అంటున్నారు. నిన్న పొద్దుపోయాక ఆయన నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనని కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ కి తరలించారు.

ప్రస్తుతం రామ్ జీకి ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. రామ్ జీ పరిస్థితి విషమంగా ఉందని, కొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి ఏమిటి అనేది చెప్పలేమంటున్నారు వైద్యులు. అయితే ఆయన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏవీ వెలుగులోకి రాలేదు. అయితే గతంలో రామ్ జీపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి. వరుసకు వదిన అయ్యే మహిళకు అసభ్యకరమైన మెసేజ్ లను పంపించాడనే కేసు నమోదు కాగా అందులో విచారణ కొనసాగుతోంది.  

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...