తమిళనాడు రాజకీయ పార్టీలలో సీట్ల పంచాయితీ మొదలయింది. బీజేపీ కోరిన సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే నేతలు ససేమిరా అంటున్నారు. బీజేపీ 32 స్థానాలు కోరగా 23కి మించి ఇవ్వలేమని అన్నాడీఎంకే చెబుతోంది. మరో పక్క 35 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది కానీ 23కి మించి ఇవ్వలేమని డీఎంకే చెబుతోంది. నామినేషన్ ల సమయం దగ్గర పడుతున్నా ఇంకా సీట్ల పంచాయితీ తేలకపోవడం సంచలనంగా మారింది.
మరోపక్క తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు, ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న ప్రకటించారు. త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న వేళ ఆమె ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని, డీఎంకేను ఓడించాలని శశికళ పిలుపునిచ్చారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.