భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

-

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని చేస్తూ ఉంటారు. సంవత్సరం లో 12 పౌర్ణమిలు వచ్చినా… మాఘ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అయితే అసలు మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?, ఏం చేస్తే పుణ్యం లభిస్తుంది…? ఇటువంటి అనేక విషయాలు మీకోసం. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా దాని కోసం చూసేయండి.

మాఘ పూర్ణిమ నాడు ధానం చేయడం ద్వారా సధ్గుణమైన ఫలాలను పొందుతారని విశ్వాసం. ఈరోజున పవిత్ర నదుల లో ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేసి పూజ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటారు. ముఖ్యంగా గంగా నది లో స్నానం చేస్తారు. ఆ రోజున విష్ణువును పూజిస్తారు. పూజ చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవయ మంత్రాన్ని జపించడం చేస్తే ఎంతో మంచి కలుగుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 27వ తేదీన వచ్చింది.

ఈరోజున దాతృత్వం, గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. పౌర్ణిమ ఫిబ్రవరి 26 శుక్రవారం మధ్యాహ్నం 3.49 నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 1.46 నిమిషాలకు ముగుస్తుంది. మాఘ పౌర్ణమి నాడు ఎవరైతే పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని అంటారు. మాఘ పూర్ణిమ రోజున కాశీ, ప్రయాగ్రాజ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news