మట్టితో మ్యాజిక్ ల్యాంప్..ఐడియా అదిరిపోలే..

-

మనసు ఉంటే ఏదైనా చెయొచ్చు.. ఆలోచన ఉండి, సాదించాలనే తపన ఉంటే ఎంతటి ఎత్తైన శిఖరాలను అధిస్తారు.తమ పట్టుదల, కోరికలతో ఎంతో మంది అత్యున్నత స్థానాలను ఆది రొహించారు.ఇప్పుడు మట్టితో ఓ వ్యక్తి అద్బుతాలను సృష్టించారు. తనకున్న నైపుణ్యంతో మట్టితో మ్యాజిక్ ల్యాంప్ ను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యాడు. బంక మట్టితో మ్యాజిక్ ల్యాంప్ తయారు చేస్తున్నాడు నాగర్ కర్నూల్ వాసి లోకేష్..అది ఒక వింతగా ఉంటుంది కనుక దానిని మ్యాజిక్ ల్యాంప్ అంటారు.

విషయానికొస్తె..ఖాధీ పథకం పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కుమ్మరి వృత్తి చేసే యువతకు ప్రత్యేక శిక్షణలు అందించింది. ఎండబెడ్ల వార్డులో కుమ్మరి వృత్తిపై ఆధారపడిన వారందరికీ మట్టితో ఎన్నో రకాల కళాకృతులు చేయవచ్చని ఆ శిక్షణలో నేర్పారు. అందులో చాలానే ఉన్నాయి..అందులో వాటర్ ఫిల్టర్లు, మ్యాజిక్ ల్యాంప్‌ల తయారీ విధానాన్ని నేర్పించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఎండబెట్లకు చెందిన లోకేష్ ఈ పథకం ద్వారా శిక్షణ తీసుకున్నాడు. వీటన్నింటిలో మ్యాజిక్ ల్యాంప్ నిర్మాణం అది పనిచేసే విధానం లోకేష్‌ని ఆకట్టుకుంటుంది. దాంతో అతను ఎలాగైనా ఈ ల్యాంప్ ను తయారు చేయాలనీ అనుకున్నాడు.

ఇక ఈ ల్యాంప్ ప్రత్యేకత విషయాన్నికొస్తే.. చూడటానికి చిన్న కుండ ఆకారంలో ఉంటుంది.రెండు రంద్రాలు ఉంటాయి.ఒకటి దీపం మద్యభాగంలో దీపం ఒత్తి పెట్టేందుకు ఒక రంద్రం, దీపం కింద బాగంలో నూనె పోసేందుకు ఒక రంద్రం ఉంటుంది. వీటిలో కింద బాగంలో ఉండే రంద్రం ద్వారా నూనె పోయాలి. దీని కోసం దీపాన్ని తలక్రిందులుగా పెట్టి నూనె పోయాలి. ఆ తర్వాత దాన్ని యథావిథిగా నిటారుగా పెట్టి.మధ్య రంధ్రంలో ఒత్తిని పెట్టి దీపం వెలిగించాలి.చక్కగా పెట్టినా అందులో నుంచి మాత్రం కిందకు కారదు..ఇలా కిందకు కారకుండా ఉండేందుకు చిన్న ట్రిక్ ఉంది.అదే మ్యాజిక్ ల్యాంప్ అసలు రహస్యం.. అతడి ఆలోచన పది మందికి ఆదర్షంగా మారింది..అందరి ప్రశంసలు అందుకున్నాడు…ఒకసారి ఈ దీపాన్ని వెలిగిస్తే మూడు రోజుల పాటు వెలుగుతుంది..దీని ధర మార్కెట్ లో కేవలం 100 రూపాయలు మాత్రమే..

Read more RELATED
Recommended to you

Exit mobile version