2024 లో బీజేపీ కి బ్యాండ్ తప్పదా … మహాకూటమికి పెరుగుతున్న మద్దతు !

-

నెక్స్ట్ దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలలో బీజేపీ కూటమిని సమూలంగా నాశనం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీజేపీని ఈ సారి విస్మరించాలని ప్రజలు ఆశిస్తున్నారు. కాగా మహాకూటమి పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అన్నీ ఒకతాతి మీదకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. గత నెలల్లో బీహార్ లోని పాట్నా వేదికగా కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 15 పార్టీలు చేతులు కలిపాయి. ఈ మీటింగ్ లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా చర్చలు జరిగాయి. ఈ మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత… ఈ నెల 17 మరియు 18వ తేదీలలో కర్ణాటకలోని బెంగుళూరు వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత నెలలో కలిసిన 15 పార్టీలతో పాటుగా, ఇప్పుడు మరో 8 కొత్త పార్టీలు ఈ మహాకూటమిలోకి చేరడం శుభపరిణామం అని చెప్పాలి.

కొత్తగా చేరిన వాటిలో MDMK, KDMK, VCK, RSP, AIFB, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మని) మరియు IUML పార్టీలు ఉన్నాయి. రానున్న కాలంలో పార్టీ ల సంఖ్య పెరిగిన ఆశ్చర్యపడనక్కర్లేదు. దీనిని బట్టి చూస్తే ఆయా రాష్ట్రాలలో బీజేపీ కి 2024 లో బ్యాండ్ బాజా తప్పేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news