శ్రీశైల క్షేత్రంలో వైభవంగా ముగిసిన మహాకుంభాభిషేకం

-

ఈనెల 16న ప్రారంభమైన శ్రీశైల క్షేత్రంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిసాయి. ఉత్సవాల చివరి రోజు కంచికామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతీ, పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతీ, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య, కాశీ పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్చ మహాస్వామి పాల్గొని పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానాలయంలో శివలింగ, నందీశ్వరుల ప్రతిష్టాపన,శివాజీ గోపుర పునర్మిర్మాణం, మహాకుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకం నిర్వహణ వల్ల మానసిక ప్రశాంతత, చతుర్విధ పురుషార్థసిద్ధి, అధ్యాత్మిక పరిపుష్టి, ఆయుర్వృద్ధి, కీర్తి జయం కలుగుతాయని, సకల ఆపదలు తొలుగుతాయని,శారీరక, మానసిక వ్యాధులు నశిస్తాయని పీఠాధిపతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కలికాల్‌ వళవన్‌, కమిషనర్‌ సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి,  ఏపీ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి , సభ్యులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news