సీట్ల పంచాయతీ తీరేదెన్నడో..

-

కనీసం ఐదు స్థానాల కోసం సీపీఐ డిమాండ్ 

తెరాస ఓటమి లక్ష్యంగా ఏర్పాటు చేసిన మహాకూటమిలో ఇంత వరకు సీట్ల పంచాయతీ తేలలేదు. ఓవైపు అభ్యర్థుల ప్రకటన నుంచి బీఫార్ కేటాయింపు వరకు తెరాస అధినేత దూకుడు ప్రదర్శిస్తుంటే…మహాకూటమిలో కేసీఆర్ వేగాన్ని అందుకోవడంలో విఫలం అయింది అనిపిస్తోంది. ఇదిలా ఉంటే స్వతంత్ర్యంగా గెలవలేని కొన్ని పార్టీలు సీట్ల కోసం పట్టుపట్టడంతో కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారింది. ఇందులో భాగంగానే. ముఖ్యంగా టీజేఎస్, సీపీఐ సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. ఇప్పటికే టీజేఎస్ అధినేత కోదండరాం రాహుల్‌ను కలిసి టికెట్ల కేటాయింపుపై చర్చించారు. సీపీఐ కూడా నాలుగు కాదు 5 సీట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతోంది. అలా అని బలం లేని స్థానాలు ఇస్తే తీసుకునేది లేదని ఆప్సన్లు సైతం వారే చేబుతున్నారు. కూటమిపై తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని.. ఆ విశ్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ఇందులో భాగంగా  సీపీఐ ప్లాన్ ఏ, ప్లాన్ బీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ఏ ప్రకారం ఐదు సీట్లిస్తే సరే.. లేని పక్షంలో ఒంటరిగానే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సీపీఐ డిమాండ్ చేస్తున్న స్థానాలు…

ఆలేరు, మునుగోడు, దేవరకొండ,  బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌ గిరి స్థానాలను ఆప్షన్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఐదు స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక టీజేఎస్ సైతం అదే విధంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ అధిష్టానానికి మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు తలనొప్పిగా మారిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news