మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీికి అనుకూలంగా వస్తున్నాయి. దాదాపు 177 స్థానాల్లో బీజేపీ, శివసేన కూటమి ముందంజలో ఉంది. అయితే ఎంఐఎం కూడా నాలుగు స్థానాల్లో ఆధిక్యత కనపరుస్తోంది. మహారాష్ట్రలో ఎంఐఎం ఒంటరిగానే పోటీ చేసింది. గత కొంతకాలంగా ఎంఐఎం దేశవ్యాప్తంగా ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. ఈ యేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ హైదరాబాద్‌తో పాటు ఔరంగాబాద్ ఎంపీ సీటు కూడా గెలుచుకుంది.
అక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ ఆలీ ఎంపీగా గెలిచారు. ఇక తాజా ఎన్నికల్లో ఎంఐఎం నాయకుల ప్లానింగ్‌తో ఇప్పుడు ఆ పార్టీ ముస్లింల ఓట్లు ఉన్న నియోజకవర్గాల్లో సత్తా చాటుతోంది. గతంలోనూ మహరాష్ట్రలో ఎంఐఎం ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో
ఔరంగాబాద్ సెంట్రల్, ఔరంగాబాద్ ఈస్ట్, కుర్లా, మలేగో స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకుపోతోంది.