హుజూర్ ఎన్నికల కౌంటింగ్ ఇప్పటి వరకూ మొత్తం ఎనిమిది రౌండ్ల పూర్తయ్యాయి. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 17400 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికొచ్చిన సైదిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమయింది. ఇక్కడ టీడీపీ నాలుగో స్థానంలో ఉంది. డిపాజిట్లు కూడా దక్కడం కష్టమే.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా చావా కిరణ్మయిని బరిలోకి దించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఏపీ సరిహద్దుల్లో ఉన్న హుజూర్ నగర్ లో పోటీ చేసి సత్తా చాటాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. కానీ ఇప్పుడు కౌంటింగ్ సరళిని చూస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థిితి కన్పించడం లేదు. బీజేపీ మూడో స్థానంలోనూ, టీడీపీ నాలుగో స్థానంలోనూ ఉంది.