మహారాష్ట్రలో బీజేపీకి అదిరిపోయే షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తమ మిత్రపక్షమైన శివసేన ఎంతకు మంకుపట్టు వీడకపోవడంతో బీజేపీ చేష్టలుడిగి చూడడం తప్ప ఏం చేయలేకపోతోంది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన హరియాణాలో పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీక మహారాష్ట్రంలో మాత్రం శివసేన దూకుడుతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శివసేన + బీజేపీ ఓ కూటమిగాను, కాంగ్రెస్ + ఎన్సీపీ మరో కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాయి.
మొత్తం 288 సీట్లున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ మార్క్ 145 సీట్లు రావాలి. అయితే, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీకి 105 సీట్లు మాత్రమే దక్కాయి. బీజేపీ మిత్రపక్ష శివసేన 56 సీట్లకే పరిమితమైంది. మరో ప్రాంతీయ పార్టీ ఎన్సీపీ 54, మరొ జాతీయ పార్టీ కాంగ్రెస్ 44 సీట్లకే పరిమితమయ్యాయి. ఇక, బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగ పడిన వారు రెబల్స్‌గా పోటీ చేశారు.
వీరిలో 17 మంది విజయం సాధించారు. ఇందులో ఎంఐఎం, ప్రకాష్ అంబేద్కర్ పార్టీలు కూడా గెలిచాయి. ఇక ఇప్పుడు శివసేన ముందు నుంచి సీఎం పదవితో పాటు మంత్రి పదవులు 50 – 50 చొప్పున పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి పదవి పంచుకునేందుకు ఒప్పుకోమని… మంత్రి పదవులు కూడా కీలకమైన శాఖలు ఇచ్చే ప్రశక్తే లేదని చెపుతోంది. ఈ పరిణా మాలను చాలా నిశితంగా గమనించిన కాంగ్రెస్.. బీజేపీకి చెక్ పెట్టేలా.. ఓ వ్యూహాత్మక నిర్ణయం తీసు కున్నట్టు తాజాగా తెలుస్తోంది.
తాము శివసేనకు సపోర్ట్ చేస్తామని… ముఖ్యమంత్రి పదవి కూడా శివసేనకే ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఇక, కాంగ్రెస్ సమీకరణలను ఎన్సీపీ కూడా స్వాగతించింది. కాంగ్రెస్ 44, ఎన్సీపీ 54, శివసేన 56 సీట్లు సాధించడంతో ఇప్పుడు మహారాష్ట్రలో సరికొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన డిమాండ్‌కు బీజేపీ తలొగ్గక పోతే ఇప్పుడు మహారాష్ట్రలో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీకి దిమ్మతిరిగిపోయే షాకే అనుకోవాలి.