తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషను కాపాడుకుందామని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కోరారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా అక్షర యాన్ ఆధ్వర్యంలో బేగంపేటలోని హరిత ప్లాజాలో మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్‌రావు పాల్గొని మాట్లాడారు. తొలి ఐదేండ్లలో మాతృభాషలో చదివిన వారే మేధావులు అయ్యారని గుర్తు చేశారు.
రాజకీయాల్లో తిట్లు సరికాదని, పిల్లలపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషను 5వ తరగతి వరకు తప్పనిసరి చేయాలని ఇరు రాష్ట్రాల సీఎఎంకు విద్యాసాగర్‌రావు సూచించారు. తెలుగు అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా, ఒమిక్రాన్, వంటి సమయాల్లో గ్రామీణ ప్రజలకు సాంకేతిక ద్వారా మాతృభాషలో అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు.