విరసం నేత ఇంట్లో పోలీసుల తనిఖీలు..అరెస్ట్

-

విరసం నేత వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీని హత్య చేసేందుకు కుట్ర కేసులో విరసం నేత పేరు ఉండటంతో హైదరాబాద్లోని గాంధీనగర్ లో గల ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన చిన్న కూతురు ఇంటితో పాటు, ఓ జర్నలిస్ట్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని హత్యకు మావోయిస్టులు పన్నిన కుట్రను పుణ పోలీసులు బయటపెట్టారు..దీంతో వారి ఆపరేషన్ కి  నిధుల సమీకరణకు వరవరరావు సాయం చేసినట్లు ఆయనపై అనుమానాలు ఉన్నాయి.

వరవరరావు అరెస్ట్…

దాదాపు 8 గంటల పాటు పూణే పోలీసులు వరవరరావుని విచారించిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో గాంధీనగర్ లోని ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news