Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ పేరుకు మాములు క్రేజ్ లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్‌కు పండగే.. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు.. విజిల్స్, మాస్ స్టెప్పులు. అరుపులు, కేకలు, మాములుగా ఉండదు. ఇంతలా స్టార్ డాం సంపాదించుకున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మహేష్ సినిమాలతోనే కాదు ..మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఆయన ఎంత బిజీ బిజీగా ఉన్న కుటుంబానికి మాత్రం కచ్చితంగా కొంత సమయాన్ని కేటాయిస్తారు. సమయం దొరికినప్పుడల్లా.. తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆయన విదేశాలకు వెళ్తుంటారు.
ఇక మహేష్, నమ్రతలది ప్రేమ వివాహమని అందరికి తెలిసిందే. వీరిద్దరూ ‘వంశీ’ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాతో ఏర్పడిన వారి స్నేహం.. కొన్ని రోజులకే ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇన్ని సంవత్సరాల దంపత్యంలో ఎలాంటి విబేధాలు లేకుండా.. అన్యోన్యంగా ఉంటూ.. ఆదర్శ జంటగా నిలిచారు. ఇక మహేష్‌బాబు సామాజిక సేవా పనులు.. ఇతర వ్యవహారాలు అన్ని నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు.
ఆయనకు సంబంధించిన అప్డేట్స్ అన్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అందిస్తుంటారు. వారి పెళ్లై దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నా వీరిద్దరూ కెమెరా ముందుకు రాలేదు. కానీ.. తాజాగా వారిద్దరూ తొలిసారి మీడియా కెమెరా ముందుకు వస్తున్నారు. ఓ మ్యాగజైన్ కోసం స్టైల్‌లుక్‌లో ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ మ్యాగజైన్ ‘హలో’ .. ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఇద్దరూ కూడా స్టైలిష్ డ్రెస్సింగ్ లుక్ లో మెరిసారు. ఈ ఫోటో షూట్ సంబంధించిన ఓ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు ముగిసిన తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.