అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…సభ్యులు మాట్లాడే మాటలు వింటే జాలిపడాల్సి వస్తోందన్నారు. దేశంలో తలయెత్తుకొని తిరిగే సర్పంచ్ లు ఎక్కడైనా ఉన్నారు అంటే అది తెలంగాణ సర్పంచ్ లు మాత్రమే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ లో అనేక గ్రామాల సర్పంచ్ లకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు మాట్లాడే సభ్యుల పార్టీలు గతంలో పాలన చేశారని…గతంలో ఒక వ్యక్తిమీద 4 రూపాయలు విడుదల చేస్తే మేము 6వందలకు పైగా ఇస్తున్నామని చెప్పారు.
మేము ఎవ్వరి గొంతు నొక్కడం లేదని… అందరికి మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణ గ్రామాలను చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు తన్మయనికి గురి అవుతున్నారని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో సర్పంచ్ లు బాధ పడ్డ రోజులే ఎక్కువ..టీఆరెస్ పాలనలో ఒక్క రోజు ఆ పరిస్థితి లేదని అన్నారు.
పంచాయతీ నిధులు ఒక్క రోజు ఆపలేదని.. కాంగ్రెస్ సభ్యుల అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలు అడిగే ఏ అంశంపై అయినా చర్చకు మేము సిద్ధం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల పై చర్చకు సభ్యులు ఎవరైనా చర్చించొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల హక్కు నిధులే గ్రామాలకు కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు.