ప్రశ్నించే గొంతుకను నొక్కడమే కదా మీపని – ఎమ్మెల్యే సీతక్క

-

అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు జరగుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యల వాడీ వేడి చర్చ జరిగింది. గులాబ్ తుఫాన్ కారణంగా రెండు రోజుల వాయిదా పడిన అసెంబ్లీ శుక్రవారం మళ్లీ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పై, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. పంచాయతీల పనితీరుపై చర్చ వాడీవేడీగా జరిగింది. కాంగ్రెస్ నేత ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆహా..ఓహో అంటేనే మైక్ ఇస్తరా అంటూ సభలో ప్రశ్నించారు. పంచాయతీల గురించి మాట్లాడితే ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతుందని అన్నారు.  మీ అంత గొప్ప మేధావులము కాదు, కానీ రూల్స్ కులోబడే మాట్లాడుతాం అంటూ స్పీకర్ పోచంపల్లిని ఉద్ధేశించి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన రూ. 15 వేల కోట్లు డైవర్ట్ అయ్యాయా..? వాటిని గ్రామపంచాయతీలకు ఇస్తున్నారా..అంటూ సీతక్క సభలో ప్రశ్నించారు. చిన్నచిన్న గ్రామపంచాయతీలకు చాల కష్టాలు ఉన్నాయి. చాలా పంచాయితీల్లో పనులు చేసిన సర్పంచులకు బిల్లులు రావడం లేదని సభ ద్రుష్టికి తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news