ఒకే ఫ్రేమ్ లో మహేశ్ బాబు ,ధోనీ..ఫోటోలు వైరల్

-

మనం అమితంగా ఇష్టపడే వాటిలో సినిమాలు, క్రికెట్ మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. ఈ రెండింటిపై మనకుండే అభిమానము చెప్పలేనిది.అలాంటిది అటు సినిమాలో సూపర్ స్టార్, ఇటు క్రికెట్‌లో సూపర్ స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో అదే జరిగింది.

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. అనంత్ అంబానీ మర్చంట్ వివాహ వేడుక ఈ ఐకానిక్ ఫొటోకు వేదికైంది. ఒకరు సినీ ఇండస్ట్రీలో, మరొకరు క్రికెట్లో సూపర్ స్టార్ అంటూ అభిమానులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సింగ్లో అదిరిపోయారంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్ కు ఈ పిక్ ఎనలేని సంతోషాన్నిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news