క్రికెట్ లో కంటే ఇతర అథ్లెట్లు శారీరకంగా చాలా కఠినంగా ఉంటారు : సైనా నెహ్వాల్

-

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించిన 17 ఏళ్ల తర్వాత టీ20 చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ విజయంతో ముంబైలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. దీనిపై సైనా నెహ్వాల్ స్పందిస్తూ.. ‘క్రికెట్‌కు ఎక్కువ శ్రద్ధ రావడం నాకు బాధగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర క్రీడలతో పోలిస్తే క్రికెట్‌పై అసమానమైన శ్రద్ధ చూపడం పట్ల ఆందోళనను వ్యక్తం చేసింది సైనా నెహ్వాల్.

క్రికెట్ కంటే ఇతర విభాగాలలో అథ్లెట్లు “శారీరకంగా చాలా కఠినంగా” ఉంటారని, ఇలాంటి గుర్తింపు, మద్దతుకు తాము కూడా అర్హులమని తెలిపింది. క్రీడల్లో సైనా ఏమి చేస్తుందో, రెజ్లర్లు, బాక్సర్లు ఏమి చేస్తున్నారో, నీరజ్ చోప్రా ఏమి చేస్తున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని సూచించారు.”నేను క్రికెట్ గురించి చెడుగా మాట్లాడినా అది అందరికీ నచ్చుతుంది. నేను దానిని ప్రేమిస్తున్నాను, కానీ మీరు ఇతర క్రీడలపై కూడా అలాంటి శ్రద్ధ పెట్టాలి, లేకపోతే, ఇండియా క్రీడా దేశంగా ఎలా మారుతుందని సైనా నెహ్వాల్ దేశ ప్రజలను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news