కల్కి మూవీలో శ్రీకృష్ణునిగా మహేష్ బాబు..?

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ చిత్రం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోన్న ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ఈ మూవీకి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగానే సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో కనిపించి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దానికి మీరేం అంటారు అని అడిగితే కచ్చితంగా మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో బాగుంటారు, అయితే అది ఈ సినిమాలో కాదు వేరే సినిమాల్లో అని అంటూ నాగ్ అశ్విన్ అన్నారు. నిజంగానే మహేష్ బాబు శ్రీకృష్ణుడు పాత్ర చేస్తే బాగుంటుంది. అయితే సినిమాలో కాదు వేరే సినిమాలలో అని అంటూ నాగ అశ్విన్ అన్నారు .

Read more RELATED
Recommended to you

Latest news