Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ కి తన తనయ సితార అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వేదికగా ఈ అయ్యా బిడ్డలు చేసే రచ్చ మాములుగా ఉండదు. తన బంగారు తల్లి ఫొటోలను షేర్ చేస్తూ.. తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటు.. తన ప్రేమను వ్యక్తపరుస్తారు. మహేశ్ బాబు.. ఇక సితార సినీ ఆరంగ్రేటానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.
మహేష్ కుమారుడు గౌతమ్ అలాగే.. సితార కూడా ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటుంది. తరుచు ఏదోక ఒక షోలో కనిపించి మెరుస్తునే ఉంటుంది. అంతేకాదు సితార సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. వంశీ పైడిపల్లి కుమార్తె ఆధ్యతో కలిసి ఈ ఛానల్ ను నిర్వహిస్తోంది. అలాగే.. మహేష్ బాబు కుటుంబంతో వంశీ పైడిపల్లి మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు తన కుమార్తెను వంశీ సినిమా ద్వారా లాంచ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఇటీవల వంశీపైడిపల్లి .. విజయ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తండ్రి కుమార్తె ల ప్రేమ మీద తీస్తున్న చిత్రంగా తెలుస్తుంది. అందుకే ప్రపంచ కుమార్తెల దినోత్సవం అయిన 26వ సెప్టెంబర్ రోజున సినిమా అనౌన్స్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా కన్సెప్ట్ మహేశ్ కూడా నచ్చిందట. ఈ చిత్రంలో దళపతి విజయ్ కు కూతురిగా సితార నటించేందుకు మహేశ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక గౌతమ్ వన్ నేనొక్కడినే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.