స్టైలిష్ లుక్ లో మహేష్ బాబు.. ఫిదా అవుతున్న నెటిజన్లు..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక మహేష్ ఇప్పుడు చూసిన అమ్మాయిలు ఎప్పుడూ మనసు పారేసుకుంటారు అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ విషయంలో వయసు అనేది కేవలం నెంబర్ గా నే ముగిలిపోతుంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు మహేష్.

mahesh-babu
mahesh-babu

అయితే మహేష్ బాబు మహర్షిలో గడ్డంతో కనిపించాడు.. సరిలేరు నీకెవ్వరులో సైనికుడి గెటప్‌లో కనిపించాడు. ఇప్పుడు పరశురాం సర్కారు వారి పాట సినిమా కోసం మరోలా మారిపోతున్నాడు సూపర్ స్టార్. ఇందులో లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు మహేష్ బాబు. సినిమాలతోనే కాదు కమర్షియల్ యాడ్స్‌లో కూడా బిజీగా ఉన్నాడు మహేష్ బాబు.

తాజాగా మహేష్ షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు విడుదలైన లుక్ చూస్తుంటే అబ్బాయిలు కూడా ఈయన్ని చూసి కుళ్లుకుంటారేమో అనిపిస్తుంది. లుక్ విషయంలో మహేష్ బాబు పెద్దగా రిస్క్ తీసుకోడు. ఈ ఫొటోలో మహేష్ మరింత హ్యాండ్సమ్ గా సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌ తీసిన ఫొటోను మహేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఓ యాడ్ షూట్ కోసం మహేష్ ఈ ఫోటోషూట్ లో పాల్గొన్నాడు.

ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ విలన్‌గా నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా వయసు 50కి చేరువవుతుంటే మహేష్ బాబు కనబడుతున్న తీరు చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news