మహేశ్ బాబు అద్భుతమైన డాన్సర్… ప్రశంసల వర్షం కురిపించిన అశ్విన్

-

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. అయితే ఈ చిత్రంపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇండియా క్రికెటర్ అశ్విన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు .ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మహేష్ బాబు నటించిన గుంటూరుకారం చిత్రం గురించి మాట్లాడారు.

ఆ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అశ్విన్ అన్నారు. మహేశ్ అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆయనకు హీరోయిన్ శ్రీలీల తోడైందని చెప్పుకొచ్చారు. తాను తెలుగు చిత్రాలు చూస్తానని అశ్విన్ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.కాగా, రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. హారిక అండ్ హసన్ క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Read more RELATED
Recommended to you

Latest news