నాకు ఇలాంటి డైలాగులు చెప్పడం ఇష్టం ఉండదు… కాని..? : పవన్ కళ్యాణ్

-

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి భగత్స్ బ్లేజ్ పేరుతో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.జాతర సమయంలో హింసకి పాల్పడటానికి ట్రై చేసిన రౌడీ మూకకి పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పడం ఈ వీడియోలో చూపించారు. ఈ నేపథ్యంలో ‘గ్లాస్ పగిలేకొద్దీ పదునెక్కుతుంది’, ‘గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాడు.ఈ క్రమంలో టీజర్లో వచ్చే గ్లాస్ డైలాగ్పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’సినిమాల్లో ఇలాంటి డైలాగులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. దర్శకుడు హరీశ్ శంకర్ బాధ భరించలేకనే బలవంతంగా చెప్పాను’ అని వెల్లడించారు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా అలరించనుంది. ఈ సినిమాతో పాటు సుజీత్ దర్శకత్వంలో పవన్ ‘OG’ మూవీ చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ సెట్స్ పైనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news