మహేష్ బాబు అలాంటి సెటైర్స్ ఎక్కువ వేస్తారు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే మొదటగా గుర్తొచ్చేది మహేష్ బాబు మాత్రమే.. ఈయన వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతోంది. ఇక ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో చెప్పమని ఆయన అభిమానులు కూడా చాలా ఆసక్తిగా అడుగుతూ ఉంటారు.. కానీ ఏ రోజు కూడా ఆ విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేయరు మహేష్ బాబు. ఇకపోతే ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు వాగ్వాదాలకు కూడా దూరంగా ఉంటారు. అంతేకాదు ఆయన ఏ రోజు కూడా ఎవరిని విమర్శించిన దాఖలాలు లేవు.. అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఇటీవల ఒక ప్రముఖ నటి మహేష్ బాబు అలాంటి సెటైర్స్ వేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆ నటి ఎవరో కాదు బొంబాయి పద్మ.. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఎన్నో విషయాలను ఆమె తెలియజేసింది.. మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా కోసం గోడలు కూడా ఎక్కేసాను అని బొంబాయి పద్మ తెలియజేసింది. ఆ సినిమా కోసం రోప్ టెస్ట్ జరిగిందని ఐదు ఫ్లోర్లు ఎక్కించి స్పైడర్ సినిమాను షూట్ చేశారు అని ఆమె తెలిపారు. ఇక నిజం సినిమా సమయంలో మేకప్ లేకుండా మహేష్ నటించారు అని, మహేష్ బాబు సెటైర్లు బాగా వేస్తారు అని, నిన్న బాగా తిట్లు తిన్నారంట కదా అని నాతో అనేవారని బొంబాయి పద్మ తెలిపారు. ఇక స్పైడర్ లో ఫోన్ కాల్ లో సంభాషణ కూడా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

ఇకపోతే వ్యాంప్ పాత్రలో వేదం సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా కొన్ని కారణాలవల్ల వదులుకున్నాను. ఇక నేను ఎవరిని కూడా సినిమా ఆఫర్లు అడగను అంటూ ఆమె చెప్పుకొచ్చారు.. ఎవరినైనా ఆఫర్స్ అడగాల్సి వస్తే అది కేవలం సీనియర్ హీరో నరేష్ అలాగే ప్రముఖ కమెడియన్ ఆలీలను మాత్రమే అడుగుతానని కూడా బొంబాయి పద్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version