అంతలా చూపించాలా అంటూ సమంత పై ట్రోల్స్ వైరల్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎప్పుడైతే నాగచైతన్య నుంచి విడిపోయిందో.. ఇక ఆ రోజు నుంచి విపరీతంగా ట్రోల్స్ కి గురవుతుందని చెప్పవచ్చు. అంతేకాదు ఈమె ఎంత మంచి పని చేసినా సరే ఈమెను ఏదో ఒక రకంగా విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇక నాగచైతన్యతో విడిపోక ముందు వరకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి అభిమానం సంపాదించుకున్న సమంత అదే సమయంలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ విడాకుల పేరుతో భర్తను మాత్రమే కాదు కుటుంబాన్ని అలాగే సినీ అభిమానులను కూడా కోల్పోయిందని చెప్పవచ్చు.. ఏ మాయ చేసావే సినిమాతో మొదటిసారి నాగచైతన్యకు పరిచయమైన ఈమె.. తన ప్రేమ రహస్యాన్ని మాత్రం బయట పెట్టకుండా వరుసగా సినిమాలపై దృష్టి పెట్టింది..

ఇక ఆ తర్వాత సినిమాలలో స్టార్ హోదాకు చేరుకున్న తర్వాత నాగచైతన్యపై తనకున్న ప్రేమను బయటపెట్టి ఇరు కుటుంబాలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. ఇక అక్కినేని కోడలిగా హోదాను కూడా సొంతం చేసుకుంది. కానీ ఆ హోదాను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. ఇకపోతే అప్పటినుంచి ఇప్పటివరకు సమంతను అక్కినేని అభిమానులు పూర్తిస్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ఇకపోతే వీరు విడాకులు తీసుకొని దాదాపు సంవత్సరం కావస్తోంది.. కానీ వీరిద్దరికి సంబంధించిన విషయం ఏదో ఒక రూపంలో ఇప్పటికీ కూడా వైరల్ అవుతూ వస్తోందని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఇలా ఉండగా తాజాగా సమంత శాకుంతలం సినిమాను నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ను సమంత తాజాగా విడుదల చేయగా.. సమంతపై బాగా ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఆ పోస్టర్లో ఈమెను ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కావాలనే అక్కినేని అభిమానులు మాత్రం అంతగా చూపించడం అవసరమా అంటూ ఫోటో పై బాగా కామెంట్లు చేస్తున్నారు. నిందించాలి అంటే ఏం చేయకపోయినా సరే నిందిస్తారు అనడానికి ఇదే నిదర్శనం.. ఇక సమంత ప్రస్తుతం ఏం చేసినా సరే నెగెటివిటీని మాత్రం గట్టిగా ఎదుర్కొంటుందని చెప్పవచ్చు.

🤍#ShaakuntalamOnNov4 @ActorDevMohan pic.twitter.com/ELPkN9HIg5
— Samantha (@Samanthaprabhu2) September 24, 2022

Read more RELATED
Recommended to you

Exit mobile version