సర్కారువారి పాటకి స్వాగతం

-

అందం, అభినయంతో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ సృష్టించుకుంది న‌టి కీర్తి సురేశ్‌.. హీరోయిన్‌గా న‌‌టిం చిన‌వి కొద్ది సినిమాలే అయిన‌ప్ప‌టికీ స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సావిత్రి జీవిత ఆదారంగా తెర‌కెక్కిన ‘మహానటి’ సినిమాతో కీర్తి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. దక్షిణాదిలో క్రేజీ ఆఫర్లతో దూసుకెళుతోన్న కీర్తి సురేశ్ పుట్టినరోజు శనివారం. ఈ సందర్భంగా టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల సినీ ప్రముఖులు ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలియజేశారు.

హీరో మహేశ్‌ బాబు కూడా సోషల్‌ మీడియా వేదికగా కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘టాలెంటెడ్‌ కీర్తీ సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కారువారి పాట’ టీమ్‌ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్‌లో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అని ట్వీట్‌ చేశారు మహేశ్‌బాబు. ఈ చిత్రానికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నితిన్, కీర్తీ సురేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ‘రంగ్‌ దే’లోని ఆమె ప్రచార చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news