అదరగొట్టిన ధవన్.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

షార్జా వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. ఢిల్లీ జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తనదైన బ్యాటింగ్ తో ఆదరకొట్టాడు. ఆయన వన్ మ్యాన్ షోగా జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీలోని మిగతా ఆటగాళ్లు తటపటాయిస్తూన్నా ధావన్‌ తన బ్యాట్ తో ప్రత్యర్ధి బౌలర్స్ కి చుక్కలు చూపించాడు.

58 బాల్స్ లో 14 ఫోర్లు, సింగిల్ సిక్స్‌ తో సెంచరీకి పైన మరో పరుగు సాధించి జట్టుని గెలిపించాడు. ఇక ఐపీఎల్‌ లో ఈరోజు ధావన్ కు తొలి సెంచరీ. చివరి ఓవర్‌ లో ఢిల్లీ గెలవాలంటే 17 పరుగులు కావాలి అప్పుడు రవీంద్ర జడేజా బౌలింగ్‌కి వచ్చినా అక్షర్ పటేల్ ఆ బౌలింగ్ లో మూడు సిక్సర్లు బాదేసి జట్టు గెలుపులో కీలకం అయ్యాడు.