మహేష్ కు హీరోయిన్ దొరికింది…

-

టాలీవుడ్ లో మహేష్ బాబు హవా నడుస్తుంది ఇప్పుడు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. వరుసగా మూడు సినిమాలు హిట్ కావడంతో మహేష్ కి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఆయన పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానున్న నేపధ్యంలో సినిమా షూటింగ్ ని మొదలుపెట్టే యోచనలో ఉన్నాడు.

కరోనా ప్రభావం కాస్త తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ని ఎంపిక చేసినట్టు సమాచారం. మహేష్‌కి ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు(మే31)న ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్న్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్ పేర్లను చిత్ర యూనిట్ పరిశీలించింది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ పేరుని కూడా చిత్ర యూనిట్ పరిశీలించినా ఆమె చేయను అని చెప్పినట్టు సమాచారం. సాహో సినిమా తెలుగులో శ్రద్దాకు మంచి ఆరంభం ఇవ్వకపోయినా ఈ సినిమా తో తన లక్ ని పరిక్షించుకోవాలి అని భావిస్తుంది. ఇక ఈ సినిమా కు భారీగా పారితోషికం తీసుకుంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని ప్రీ షూట్ పనులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news